శృతి హాస‌న్ మౌనం.. కారణం అదేనా?

99
- Advertisement -

సలార్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇప్పటి వరకూ ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయలేదు. ఇప్పుడిప్పుడే టీమ్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తోంది. ఐతే, ప్ర‌భాస్ కి హీరోయిన్‌గా న‌టించిన స‌లార్ సినిమాలో శృతి హాస‌న్ హీరోయిన్ అన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా మ‌రో వారంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ప్ప‌టికీ, ఈ సినిమా విష‌యంలో శృతి అస‌లు నోరు మెదప‌ట్లేదు. దానికి కార‌ణం శృతికి ఈ సినిమాలో పెద్ద‌గా ప్రాధాన్య‌త లేని పాత్ర ద‌క్క‌డ‌మేన‌ని తెలుస్తోంది.

అందుకే, శృతి స‌లార్ ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉంటున్న‌ట్లు టాక్. పైగా సలార్ పై మీడియా ఏ ప్రశ్న అడిగినా శృతి హాస‌న్ మాత్రం నోరు మాత్రం మెదపడం లేదు. మరోపక్క నెటిజన్స్ శృతి ఎందుకు సైలెన్స్‌ గా ఉన్నావ్ ? అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. శృతి హాస‌న్ మాత్రం ఫ్యాన్స్ పోస్ట్ లను కూడా పట్టించుకోవడం లేదు. మరోపక్క అడివి శేష్ హీరోగా నటిస్తున్న షానియల్ డియో దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ డిసెంబర్ 18న విడుదల చేయనున్నారు. శ్రుతితో కలిసి నటిస్తుండటం గర్వంగా ఉందని అడివి శేష్ ట్వీట్ చేశారు.మొత్తానికి అడివి శేష్ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తుండటం నిజంగా విశేషమే అంటూ మెసేజ్ లు చేస్తున్నారు. ఏది ఏమైనా శృతి హాస‌న్ మాత్రం సలార్ సినిమాని పక్కన పెట్టి, అడివి శేష్ సినిమా పై దృష్టి పెడుతుంది.

Also Read:చలికాలంలో బెల్లం తింటే ఎన్ని లాభాలో!

- Advertisement -