శృతి హాసన్ అలానే కానిచ్చేసింది..!

151
Shruthi hassan dressing style, Katamarayudu, Pawan Kalyan,Dolly
Shruthi hassan dressing style, Katamarayudu, Pawan Kalyan,Dolly

కెరీర్ ఆరంభం నుంచి చాలా ప్రొఫెషనల్‌గా ఉంటూ ఫిజిక్ విషయంలో పక్కాగా కేర్ తీసుకునే శృతి హాసన్‌కు ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాకు.. సినిమాకు తనదైన గ్లామర్‌తో సినిమాకు అందాన్ని తెస్తుంది శృతి హాసన్. అయితే తాజాగా రిలీజ్ అయిన ‘కాటమరాయుడు’ సినిమాలో మాత్రం అమ్మడి లుక్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. పవర్ స్టార్ గబ్బర్ సింగ్ చిత్రానికి శృతి హాసన్ గ్లామర్ ఎంత ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. ఎప్పుడు నాజుగ్గా కనిపించే శృతి ఇటీవల లావైపోయి దర్శనమిచ్చింది. నడుము భాగంలో ఫ్యాట్ పెరిగి ఆ అందాలను ఎక్స్‌ఫోజ్ చేయలేక కవర్ చేసుకునే పరిస్థితికి వచ్చేసింది అమ్మడు.

ACS_3386

ఇటీవల కాలంలో ఫిజిక్‌పై పట్టుసడలించిందో ఏమో.. విమర్శలు ఎదుర్కొంటోంది శృతి. సినిమా చూసిన చాలా మంది శ్రుతిహాసన్ స్క్రీన్ రీజెన్సీ అస్సలు బాగోలేదనే విమర్శలు చేశారు. కొందరు క్రిటిక్స్ సైతం కొన్ని సన్నివేశాల్లో, ముఖ్యంగా ఫారిన్ లొకేషన్లో చిత్రీకరించిన రెండు పాటల్లో శృతి డ్రెస్సింగ్ స్టైల్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదని పైగా కాస్త ఇబ్బందిగా కూడా ఉందని అన్నారు. కాస్ట్యూమ్స్ విషయంలోనూ అమ్మడు జాగ్రత్త పడటంలేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

ACS_4602

దీనిపై కాటమరాయుడు దర్శకుడు డాలీ స్పందిస్తూ.. ఈ ఫీడ్ బ్యాక్ ను మేము కూడా విన్నామన్నారు. శృతి కాస్ట్యూమ్స్ ను ముంబై బేస్డ్ డిజైనర్ రూపొందించారని, షూటింగ్ కు ముందు వాటిని చూసి తమకు కూడా పూర్తి సంతృప్తి కలుగలేదని, ఇక చివరి నిముషంలో వేరే ప్రత్యాన్మాయం లేకపోవడంతో చేసేది లేక వాటితోనే చిత్రీకరణ కానిచ్చేశామని అన్నారు. అలాగే శృతి హాసన్ మాత్రం ఎలాంటి లోటు లేకుండా సినిమా కోసం కష్టపడ్డారని కూడా తెలియజేశారు. వరుస సినిమాలతో ఊపుమీదున్న శృతి.. మరికొన్నాళ్లు స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగాలంటే మాత్రం జాగ్రత్తపడక తప్పదంటున్నారు శృతి అభిమానులు.