హీరోయిన్ శ్రియ శరణ్ గత 20 ఏళ్లుగా తన సినీ ప్రయాణం కొసాగిస్తూనే ఉంది. ఈ ముద్దుగుమ్మ హిందీ,తెలుగు, తమిళ, కన్నడ, భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ భర్తతో కలిసి స్పెయిన్‌లో ఉండిపోయింది. అక్కడే బార్సిలోనలో శ్రియ తన ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజయ్ చేస్తోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా శ్రియ సోషల్ మీడియాలో లైవ్‌లో మాట్లాడింది. ఇందులో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. తనను వర్క్ చేసిన కో స్టార్స్ గురించి పలు ఆస్తికరమైన విషయాలు వెల్లడించింది. అందులో ముఖ్యంగా ప్రభాస్,పవన్,జూ.ఎన్టీఆర్,సూపర్‌స్టార్ రజినీ ల గురించి ప్రస్తావించింది శ్రియ.
అయితే హీరో ప్రభాస్‌లో మీకు నచ్చిన విషయం ఏంటని ఓ అభిమాని అడగ్గా..ప్రభాస్ కళ్లు అంటే తనకు చాలా ఇష్టం అని శ్రియ సమాధానం ఇచ్చింది. ఈ ఇద్దరూ కలిసి ఛత్రపతిలో నటించిన సంగతి తెలిసిందే. కాగా మరో అభిమాని జూ.ఎన్టీఆర్ గురించి అడగ్గా.. ఒకప్పుడు ఎన్టీఆర్ చూస్తే చాలా అమాకంగా, సైలెంట్‌గా కనిపించేవాడు కానీ ఇప్పుడు చాలా మారిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ను చూస్తుంటే ముచ్చటేస్తుందని ఈముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.ఇక ఎన్టీఆర్‌తో నా అల్లుడు మూవీలో నటించింది.
అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ..పవన్ చాలా మంచి నటుడు అని.. అతడితో కలిసి నటించేటప్పుడు చాలా నేర్చుకున్నానని చెప్పింది. అంతేకాదు పవన్ చాలా చదువుకున్నాడని శ్రియ తెలిపింది. పవన్‌తో బాలు చిత్రంలో నటింది. తనకు తమిళంలో రజినీకాంత్ ఫేవరేట్ హీరో అని చెప్పింది శ్రియ.. ఆయన పవర్ హౌజ్ అని.. శివాజీలో నటించేటప్పుడు చాలా నేర్చుకున్నట్లు చెప్పింది. ఇక శ్రియ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో అజయ్ దేవ్‌గన్ భార్యగా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 1.. తమిళ్‌లో 3 సినిమాలు.. హిందీ ఒక సినిమా చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.