పదేళ్ళకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న శ్రియ, ఓ దశలో హీరోయిన్‌గా అవకాశాలు సన్నగిల్లడంతో చిన్నా చితకా పాత్రలకీ ఓకే చెప్పేసింది. మళ్ళీ శ్రియ దశ తిరుగుతోందిప్పుడు. వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. ‘మనం’, ‘దృశ్యం’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాల్లో గ్లామర్‌కి దూరంగా వున్న పాత్రల్లో నటించినా, ఇప్పుడు మళ్ళీ గ్లామర్ డోస్ పెంచేసింది. తన గ్లామర్ తో కుర్రకారు మనసులు దోచేస్తూ వచ్చిన శ్రియ, ఇక భయపెట్టే సినిమాల్లోను నటించడానికి రెడీ అవుతోంది.
ఈ ఏడాది ఆమె ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి మైల్ స్టోన్ మూవీలో నటించింది. ఇప్పుడు బాలయ్య సరసనే ‘పైసా వసూల్’లోనూ నటించింది. త్వరలోనే శ్రియ ఓ కొత్త దర్శకుడితో లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ చేయబోతోందట. ‘పైసా వసూల్’ ప్రమోషన్లలో భాగంగా ఆ సినిమా వివరాలు వెల్లడించింది శ్రియ.
తనతో సినిమా చేయబోయే యువ దర్శకుడి వయసు కేవలం 23 ఏళ్లేనని.. ఐతే అతను చెప్పిన సైకో థ్రిల్లర్ కథ తనను కట్టి పడేసిందని.. ఈ సినిమా తనకు ఒక మేకోవర్ అవుతుందని.. తనను కొత్తగా చూపిస్తుందని.. ఈ సినిమా చేయడానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని శ్రియ చెప్పింది. త్వరలోనే సెట్స్ పైకి వెళుతున్నామని స్పష్టం చేసింది.