రాంగ్‌ ట్రాక్‌లో పడ్డ శ్రియ..

248
- Advertisement -

హీరోయిన్‌ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్‌కి ఆఫర్లు రాకపోతే ఏంచేస్తారు..? వచ్చిన ఆఫర్లతో సర్ధుకుపోవడమే. లేదా ఆఫర్ల కోసం అందాలను ఎర వెయ్యడమే. ఇదే ఇప్పటి ట్రెండ్‌. అయితే ఇప్పుడొస్తున్న కత్తిలాంటి హీరోయిన్లకే ఛాన్స్‌ లేదు…అలాంటప్పుడు సీనియర్‌ భామలని ఎవరు పట్టించుకుంటారు? ఇలా అనుకుంటే..పప్పులో కాలేసినట్టే.!
 Shriya Saran Enjoyed playing negative role
ఎందుకంటే సీనియర్‌ హీరోయిన్‌ అయినప్పటికీ..క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతారు. సరిగ్గా ఇలాగే.. తన ట్యాలెంట్‌ సరుకేంటో చూపించేస్తోంది ఓ సీనియర్‌ భామ. ఆ హీరోయిన్‌ సీనియర్ అయినప్పటికీ..అప్‌కమింగ్‌ సినిమాల్లో తన పేరుని కూడా టచ్‌ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇంతకీ ఆ సీనియర్‌ సుందరి ఎవరో కాదు..క్యూట్ హీరోయిన్ శ్రియా శరన్. ఇటీవలే బాలయ్య సినిమా శాతకర్ణిలో ఓ నెగిటివ్‌ రోల్‌ లో మెరిసింది శ్రియ. అయితే ఇప్పుడు ఈ అమ్మడు నెగిటివ్‌ ట్రాక్‌లోనే కిక్కుంది అనుకుందో ఏమోగానీ..ఇప్పుడు నెగిటివ్‌ రోల్స్‌ చెయ్యడానికి సై అంటోంది.

మామూలుగా అయితే.. కొంతమంది పాజిటివ్‌ రోల్స్‌ కే ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే..నెగిటివ్‌ రోల్స్‌లో సక్సెస్‌ అవుతే..గ్లామర్‌ రోల్స్‌ని ఎక్కడ మిస్సవ్వాల్సి వస్తుందో అని. ఒక్కోసారి గ్లామర్‌ రోల్స్‌ కూడా దక్కడంలేదనుకోండి అది వేరే విషయం.
 Shriya Saran Enjoyed playing negative role
ఇక శ్రియ గ్లామర్‌ రోల్స్‌ దక్కవని డిసైడైందా? లేక వచ్చిన ఆఫర్లకే కమిట్‌ అవుతుందో తెలీదుగానీ..నెగిటివ్‌ క్యారెక్టర్‌ కి ఫిక్స్‌ అయిపోయింది. అందుకే తన నెక్ట్స్‌ మూవీలో నెగిటివ్‌ రోల్‌ లో కనిపించబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ్‌డబ్బింగ్ మూవీ 16 తెలుగుతో పాటూ తమిళ్ లో కూడా హిట్ అయింది.

ఈ మూవీని  డైరెక్టర్ చేసిన కార్తీక్ నరేన్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నాడు. ‘ నరకాసురన్ ‘ టైటిల్ తో రానున్న ఈ మూవీలో శ్రియ శరన్ ని నెగటివ్ రోల్ లో చూపించబోతున్నాడట దర్శకుడు. అయితే గతంలో రమ్యకృష్ణ ‘ నరసింహ ‘ లోను…త్రిష ‘ ధర్మయోగి ‘ సినిమాలో నెగటివ్ రోల్స్ చేసి సక్సెస్ అయ్యారు. మరి ఇప్పుడు శ్రియా కూడా ఆ వరుసలో నెగటివ్ రోల్ చేసి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

- Advertisement -