కుటుంబసభ్యులు,అత్యంత సన్నిహితుల సమక్షంలో తన ప్రియుడు,రష్యాకు చెందిన కోషివ్‌ను టాలీవుడ్ బ్యూటీ శ్రియ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయ్ పూర్‌లో ఘనంగా జరిగింది. శ్రియ పెళ్లికి సంబంధించిన విషయాలను కుటుంబసభ్యులు అత్యంత రహస్యంగా ఉంచారు. ఈ పెళ్లికి బాలీవుడ్ నుంచి మనోజ్ భాజ్‌పాయ్, షబానా అజ్మీ మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.
తాజాగా శ్రియ పెళ్లికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 8 ఏళ్లుగా యాక్టింగ్ కెరీర్ ను సాగిస్తున్న శ్రియ లేటు వయసులోనూ యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా పోటినిస్తోంది.
బాలీవుడ్‌లో 2015లో అజయ్ దేవగణ్, టబు జంటగా వచ్చిన ‘దృశ్యం’ చిత్రంలో కనిపించిన లెటెస్ట్‌గా శ్రియ టాలీవుడ్‌లో బాలయ్యతో రెండు సినిమాలు చేసింది. గౌతమిపుత్ర శాతకర్ణి,పైసా వసూల్ సినిమాల్లో నటించగా మంచు విష్ణుతో గాయత్రి సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.
https://www.instagram.com/p/Bgg9FREAkPX/?taken-by=shriyasaranfangirl