నేటి రోజుల్లో చాలా మందికి శృంగార సమస్యలు ఎక్కువౌతున్నాయి. ముఖ్యంగా పురుషులలో అంగస్తంభన, శీఘ్రస్కలనం, లాంటి సాధారణ శృంగార సమస్యలు వేధిస్తుంటాయి. అయితే ఇలాంటి సమస్యను బయట చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. డాక్టర్స్ ను సంప్రదించడానికి కూడా వెనుకడుగు వేస్తుంటారు. అయితే పురుషులలో వచ్చే సాధారణ శృంగార సమస్యలకు యోగాలో కొన్ని ఆసనాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. అలాంటి ఆసనాలలో ” అనంతాసనం ” ఒకటి. ఈ ఆసనం ప్రతిరోజూ సాధన చేయడం వల్ల పురుషులలో శృంగార సామర్థ్యం మెరుగుపడుతుంది. జననేంద్రియ భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా అంగస్తంబన వంటి సమస్యలు దూరం అవుతాయి. అంతే కాకుండా ఈ ఆసనం వేయడం వల్ల ఇంకా చాలానే ఉపయోగాలు ఉన్నాయి. తొడల భాగంలోని పెరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఈ ఆసనం చక్కగా ఉపయోగ పడుతుంది. అంతే కాకుండా కాళ్ళు సాగదితకు గురి అవుతాయి. తద్వారా కీళ్లనొప్పులు వంటి సమస్యలు దూరం అవుతాయి. పిక్కలు, తొడలు బలం పుంజుకుంటాయి.
అనంతాసనం వేయు విధానం
ముందుగా చదునైన నేలపై శవాసనం వేసి..కుడి ప్రక్కకు తిరిగి ఫోటోలో చూపిన విధంగా కుడిఅరచేతిపై తలను ఉంచి, ఎడమ కాలు ఎత్తి, ఎడమ చేతితో ఎడమకాలును పట్టుకోని పాదాన్ని పదిసార్లు పూర్తిగా పైకి కిందకి వంచుతూ ఎత్తాలి. ఆ తరువాత ఇదే విధంగా ఎడమవైపు కూడా తిరిగి పైక్రియాలన్నీ చేయాలి. ఈ సమయంలో శ్వాసక్రియ నెమ్మదిగా జరిగించాలి.
జాగ్రత్తలు
మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయరాదు.
Also Read:KTR:ఆర్ఆర్ ట్యాక్స్‌పై చర్యలేవి?