- Advertisement -
ముకుంద్ పాండే దర్శకత్వంలో శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా అనే చిత్రం తెరకెక్కుతోంది. అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్ లపై అనిల్ వ్యాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్ కార్యక్రమాన్ని నిర్మించారు.
11-12వ శతాబ్దాల నాటి మహోబా సాంస్కృతిక వైభవాన్ని, అలాగే భగవాన్ శ్రీ కృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని ఈ చిత్రంలో చూపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించనున్నట్లుగా చెప్పారు.
పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక బృందం, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు.
Also Read:క్రికెట్ బ్యాట్ పట్టనున్న మెస్సీ!
- Advertisement -

