భారత్‌కు ఇది నిరాశాజనకమైన సిరీస్ అని భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంగీకరించాడు. ఐర్లాండ్ జట్టు కనబరిచిన ప్రొఫెషనలిజం, పిచ్ పరిస్థితులపై వారికకున్న అవగాహన, వారి అద్భుతమైన ఫీల్డింగ్‌ను అతను కొనియాడాడు. ఈ సిరీస్ విజయం సాధించడానికి ఐర్లాండ్ పూర్తి అర్హురాలని అన్నాడు.
మన బౌలర్లు తమ ప్రణాళికలను బాగానే అమలు చేశారని భావించిన అయ్యర్…. బ్యాటర్లు మాత్రం పిచ్ ఎలా స్పందిస్తుందో సరిగ్గా అంచనా వేయలేకపోయారని, అలాగే సింగిల్స్‌ను డబుల్స్‌గా మార్చడంలో విఫలమయ్యారని పేర్కొన్నాడు. కీలక సమయాల్లో ఐర్లాండ్ జట్టు మనకంటే మెరుగైన ఆటతీరును కనబరిచిందని చెప్పాడు.
నిజాయితీగా చెప్పాలంటే, ఇది ఖచ్చితంగా మాకు మంచి సిరీస్ కాదు కానీ వారు ఆడిన విధానానికి వారిని అభినందించాల్సిందే. ఐర్లాండ్ జట్టు ప్రొఫెషనలిజం చూపించింది. పిచ్ ఎలా ప్రవర్తించబోతుందనే దానిపై వారికి అద్భుతమైన అవగాహన ఉంది. అంతేకాకుండా వారి ఫీల్డింగ్ కూడా అమోఘంగా సాగింది. కాబట్టి ఇది వారి సాధించిన సమగ్రమైన విజయం వారికి నా అభినందనలు అని మ్యాచ్ ముగిసిన అనంతరం అయ్యర్ అన్నాడు.
ALso Read:GIC:తెలంగాణ క్రికెట్‌లో కొత్త అధ్యాయం
ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. ప్రస్తుత టీ20 ప్రపంచ ఛాంపియన్‌లను ఓడించడమే కాకుండా టీ20 ఐల్లో భారత్ సాధించిన వరుస 16 సిరీస్‌ల విజయ పరంపరకు బ్రేక్ వేశారు.

