భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరుతున్న నేపథ్యంలో, భారత జట్టుకు తదుపరి వన్డే కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. 2027 వరల్డ్ కప్ వరకు ఆయన జట్టును నడిపే అవకాశముందని చెబుతున్నారు.
శుభ్‌మన్ గిల్ వాస్తవానికి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ అవుతారని అంతా భావించారు. 30 ఏళ్ల అయ్యర్ ఈ ఏడాది ప్రారంభంలో భారత్ గెలిచిన చాంపియన్స్ ట్రోఫీలో కీలక పాత్ర పోషించాడు. ఐదు మ్యాచ్‌ల్లో 243 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇప్పటివరకు 70 మ్యాచ్‌ల్లో 2,845 పరుగులు చేసి, 48.22 సగటుతో ఐదు సెంచరీలు సాధించాడు.
38 ఏళ్ల రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే జట్టును నడిపిస్తున్నాడు. కానీ ఆయనతో పాటు విరాట్ కోహ్లీ కూడా టెస్టులు, T20ల నుండి రిటైర్ కావడంతో, రాబోయే అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ వారిద్దరికీ చివరి అంతర్జాతీయ సిరీస్ కావచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. రోహిత్ వైదొలగాలని నిర్ణయిస్తే, అయ్యర్ ఆస్ట్రేలియా సిరీస్ నుంచే నాయకత్వం చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read:నామినేషన్ వేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి

