శ్రేయాస్ ఆరోగ్యంపై తాజా అప్‌డేట్

11
- Advertisement -

భారత జట్టు స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యంపై తాజా అప్‌డేట్ విడుదల చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అయ్యర్‌ను సిడ్నీ ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది.

బోర్డు విడుదల చేసిన మూడో మెడికల్ బులెటిన్ ప్రకారం, అయ్యర్ ప్రస్తుతం స్థిరంగా ఉన్నాడు, కోలుకుంటున్నాడు. విమాన ప్రయాణానికి అనుకూలంగా ఉన్నట్లు డాక్టర్లు తేల్చిన తర్వాత ఆయన భారత్‌కు తిరిగి రానున్నారు. అక్టోబర్ 25న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన సిరీస్ మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కెరీను అద్భుతంగా క్యాచ్ పట్టి ఔట్ చేసిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ అసహజంగా పడిపోయాడు. ఆ సమయంలో ఆయన రిబ్స్ (పక్కటెముకలు) గాయపడ్డాయి. వెంటనే ఫీల్డ్ నుంచి బయటకు తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు.

శ్రేయాస్ ప్రస్తుతం స్థిరంగా ఉన్నాడు, కోలుకుంటున్నాడు. సిడ్నీ మరియు భారతదేశంలోని నిపుణులతో కలిసి పనిచేసిన బీసీసీఐ మెడికల్ టీమ్ ఆయన ఆరోగ్య పురోగతిపై సంతృప్తిగా ఉంది. ఈరోజు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

Also Read:రోహిత్ రికార్డు బ్రేక్ చేసిన బాబర్!

- Advertisement -