NBK 109:బాలయ్యతో లేడీ విలన్?

17
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.  అఖండ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత బాబీ దర్శఖత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరీర్‌లో ఇది 109వ సినిమా కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తమన్ సంగీతం అందిస్తుండగా విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇక మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లింగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ ఫుల్ డైలాగ్‌లతో అదరగొట్టారు బాలయ్య.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.  నటి శ్రియా రెడ్డి ఓ కీలక పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. అది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో. గతంలో ఇలాంటి పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న శ్రియా…బాలయ్యతో తొలిసారి విలనిజాన్ని ఎలా పండిస్తుందో వేచిచూడాలి.

Also Read:‘కన్నప్ప’లో కాజల్ అగర్వాల్

- Advertisement -