‘ఇంటి నెం.13’ కోసం శ్రీ‌యా గోష‌ల్

60
sriya goshal
- Advertisement -

కాలింగ్‌బెల్ రాక్ష‌సి చిత్రాల ద‌ర్శ‌కుడు ప‌న్నారాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మ‌రో డిఫ‌రెంట్ మూవీ ‘ఇంటి నెం.13’. రీగ‌ల్ ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై హేస‌న్ పాషా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కేవ‌లం 24 గంట‌ల్లోనే టీజ‌ర్‌కు ఒక మిలియ‌న్ వ్యూస్ ల‌భించాయి.

ఈ సినిమా టీజ‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఒక మెలోడియ‌స్ సాంగ్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ‘పో పోవే…’ అంటూ సాగే ఈ పాట‌కు రాంబాబు గోశాల సాహిత్యం అందించ‌గా, వినోద్ యాజ‌మాన్య స్వ‌రాలు స‌మ‌కూర్చారు. భార‌త‌దేశంలోనే టాప్ సింగ‌ర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీయా గోష‌ల్ ఈ పాట‌ను పాడారు. 2022 తెలుగులో శ్రీయా పాడిన తొలి పాట ఇదే కావ‌డం విశేషం. శ్రీయాతోపాటు యాజ‌మాన్య కూడా ఈ పాట‌ను ఆల‌పించారు. శ్రీయా ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో ఎన్నో అద్భుత‌మైన పాట‌లు పాడారు. వాటి స‌ర‌స‌న ఈ పాట కూడా నిలుస్తుంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే ఈ పాట సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

- Advertisement -