సైనా పెళ్లి వార్తలు అందుకేనా..?

242
saina nehwal
- Advertisement -

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. అయితే సైనా పెళ్లిపై ఇటు సైనా కుటుంబం కానీ, అటు కశ్యప్‌ కుటుంబం కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు తాజాగా సైనా నెహ్వాల్‌పై మరో వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. సైనాపై ఓ బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సైనా పాత్రలో శ్రద్ధాకపూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బయోపిక్‌లో సెలెబ్రిటీ జీవితంలో ఒడిదొడుకులు.. ఎత్తుపల్లాలు.. ఛాలెంజ్ లు.. గెలుపు అన్నీ ఉండాలి. వీటన్నిటికి తోడు డ్రామా కూడా ఉండాలి.

Saina-Nehwal

అయితే సైనా నెహ్వాల్‌ జీవితంలో బయోపిక్‌ తెరకెక్కించేంత విషయాలు ఏమి లేనట్టు తెలుస్తోంది. అయితే సైనా నెహ్వాల్‌ తన కెరియర్‌ పరంగా ఎన్నో విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే తన పర్సనల్ లైఫ్ లో ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించేంత ట్విస్ట్ లు టర్న్ లు లేవు. సైనా జీవితంలో ఒక్క వివాదం కూడా లేదు. అందుకే సైనా లవ్ స్టొరీ ని హైలైట్ చెయ్యాలని ఫిలిం మేకర్స్ చూస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే బయోపిక్‌కు హైప్‌ తీసుకురావడం కోసం సైనా, కశ్యప్ ల పెళ్లి విషయాన్ని హైప్‌ తీసుకొస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి చేసుకుంటారు అని ప్రచారం జరుగుతున్నా.. దీనిపై వీరు ఇరువురు ఇప్పటి వరకు నోరు మెదపలేదు.. అయితే కేవలం సైనా బయోపిక్‌ కోసమే వీరి పెళ్లి విషయాన్ని హైలెట్‌ చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది.

- Advertisement -