ఫర్హాన్‌తో అఫైర్‌..పట్టించుకోవడం మానేశా

270
Shraddha Finally Clears The Relationship With Farhan
- Advertisement -

బాలీవుడ్ నటుడు ఫర్హాన్‌ అఖ్తర్‌తో అఫైర్‌పై అందాల తార శ్రద్ధాకపూర్ మౌనం వీడింది. వారిద్దరూ సహ జీవనం చేస్తున్నారని వార్తలు జోరందుకున్న నేపథ్యంలో శ్రద్ధ కపూర్ మీడియాపై కస్సుబుస్సులాడింది. గాలివార్తలకు కూడా హద్దు పద్దు ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పటిలానే ఫరాన్ కేవలం నా స్నేహితుడు మాత్రమే అని శ్రద్ధా వివరణ ఇచ్చింది.

అయితే శ్రద్ధ కోసమేఫర్హాన్‌ తన భార్య అధునా నుంచి విడిపోయినట్లు పుకార్లు షికారు చేశాయి. అలాగే ఫర్హాన్‌ అక్తర్‌ ఇంటికి శ్రద్ధ మకాం మార్చిందని.. అయితే ఆమె తండ్రి శక్తికపూర్‌ బలవంతంగా తిరిగి ఆమెను వెనక్కి తీసుకొచ్చినట్టుగా కొద్దిరోజుల క్రితం రూమర్లు పుట్టుకొచ్చాయి.

Shraddha Finally Clears The Relationship With Farhan
ఈ నేపథ్యంలో స్పందించిన ఈ బ్యూటీ  ఇలాంటి కట్టుకథలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మొదట్లో ఈ పుకార్లను పట్టించుకొని బాధపడేదాన్ని. ఈ రూమర్లపై ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా.. మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటాయి. మనచుట్టూ పుట్టుకొచ్చే ఈ ఉహాజనిత వార్తలను నియంత్రించడం కొన్నిసార్లు సాధ్యపడదు. అందుకే వీటిపై స్పందించి సమయాన్ని వృథా చేసుకోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలుసుకున్నా. అందుకే నాపై వచ్చే పుకార్లను పట్టించుకోవడం మానేశా. వాటి గురించి ఆలోచించడం మానేసి కేవలం నా పని మీద మాత్రమే ఫోకస్‌ చేయాలని అనుకుంటున్నా.’’ అని చెప్పుకొచ్చింది శ్రద్ధాకపూర్‌.

ప్రస్తుతం బాలీవుడ్‌లో శ్రద్ధా కపూర్ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. అర్జున్ కపూర్‌తో హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం మే 19న విడుదలకు సిద్దమవుతున్నది. అలాగే దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న హసీనా సినిమాలోను సైనా నేహ్వాల్ బయోపిక్‌లో నటిస్తోంది.

Shraddha Finally Clears The Relationship With Farhan

- Advertisement -