మా అధ్యక్షుడు ట్రంపా..వెల్లువెత్తిన నిరసనలు

317
SHOOTING @ ANTI TRUMP RALLY
- Advertisement -

రోజుకొక సంచలనంతో సహవాసం చేసిన ట్రంప్‌.. అగ్రరాజ్యాధిపతిగా గెలిచి అతిపెద్ద సంచలనం సృష్టించారు. అమెరికా రాజకీయాల్లో ఏ పదవీ చేపట్టకుండా, సైన్యంలో పనిచేయకుండా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుని ప్రపంచాన్ని నివ్వెరపరిచారు.హోరాహోరీగా సాగిన పోరులో ప్రభుత్వ వ్యతిరేక పవనాల్ని తనకు అనుకూలంగా వాడుకున్న ట్రంప్‌ అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 18 నెలల క్రితమే రాజకీయాల్లో చేరిన ట్రంప్‌ 289 ఎలక్టోరల్‌ కాలేజి ఓట్లతో సరిపడా ఆధిక్యాన్ని సాధించారు. హిల్లరీ 218 ఎలక్టోరల్‌ కాలేజి ఓట్లతో సరిపుచ్చుకున్నారు.

ఇక ట్రంప్‌ గెలుపుపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అమెరికాలో మాత్రం సీన్ రివర్సైంది. ఎక్కువ మంది అమెరికన్లు కోరుకున్న హిల్లరీ క్లింటన్ కాకుండా, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కానుండటాన్ని అమెరికన్లు జీర్ణించుకోలేకపోయారు. అమెరికాలోని ప్రధాన నగరాలైన న్యూయార్క్, చికాగో, కాలిఫోర్నియా, ఫిలడెల్ఫియా తదితర నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ ట్రంప్ వ్యతిరేక ఆందోళనల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఓక్లాండ్ లోని డౌన్ టౌన్ ప్రాంతంలో ట్రంప్ చిత్ర పటాలను దగ్ధం చేశారు. ఓరెగాన్ లో వందలాది మంది ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. పోర్ట్ ల్యాండ్ లో రైళ్ల రోకో నిర్వహించారు.

SHOOTING @ ANTI TRUMP RALLY

వాషింగ్టన్ స్టేట్‌లోని సియాటెల్ నగరంలో ట్రంప్ తమకు అధ్యక్షుడిగా వద్దని నినాదాలు చేస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ ర్యాలీ జరుగుతున్న ప్రాంతంలో దుండగులు కాల్పులు జరిపినట్లు సియాటెల్ పోలీసులు, అగ్నిమాపక విభాగం వెల్లడించింది. కాల్పుల్లో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, అగ్నిమాపక సహాయ సిబ్బంది ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ట్రంప్ వ్యతిరేక ర్యాలీకి , కాల్పులకు సంబంధం ఉందా? లేదా? అనే విషయం ఇంకా స్పష్టం కాలేదని పోలీసులు వెల్లడించారు.

‘దట్స్ నాట్ మై ప్రెసిడెంట్’, ‘ఏ రేపిస్ట్ ఈజ్ నాట్ మై ప్రెసిడెంట్’, ‘వీ డునాట్ కన్సెంట్’, ‘నాట్ మై ప్రెసిడెంట్’ అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులను ప్రదర్శించారు. సియాటెల్ లో 100 మందికి పైగా నిరసన కారులు రాస్తారోకో నిర్వహించారు. ట్విట్టర్ లో ‘నాట్ మై ప్రెసిడెంట్’ పేరిట హాష్ ట్యాగ్ ఏర్పాటు చేయగా, దాదాపు 5 లక్షల మంది దాన్ని లైక్ చేశారు.

SHOOTING @ ANTI TRUMP RALLY

- Advertisement -