ఆసియా కప్‌లో వరుసగా మూడోసారి భారత్ చేతిలో ఓటమి పాలైంది పాకిస్తాన్. ఆదివారం జరిగిన ఫైనల్‌లో పాక్ జట్టు ఓటమి కావడం ఆ దేశ అభిమానులను తీవ్ర నిరాశ పర్చింది. ఈ నేపథ్యంలో పాక్ జట్టు మేనెజ్‌మెంట్ పై తీవ్ర విమర్శలు చేశారు ఆ జట్టు మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్.
దురదృష్టవశాత్తూ, ఇది జట్టు సమస్య కాదు. మిడిల్ ఆర్డర్ సమస్య అనేది సరైన ఆటగాళ్లను ఎంపిక చేయని మేనేజ్మెంట్ చేసిన తప్పు…చెప్పాలంటే, ఇది అర్థరహితమైన కోచింగ్. ఇలాంటి పదాలు వాడినందుకు క్షమించండి, కానీ ఇది అర్థరహితమైన కోచింగ్. మా మ్యాచ్ విన్నర్స్ అయిన హసన్ నవాజ్, సల్మాన్ మీర్జా లాంటి వాళ్లు ఉన్నారు. పరిస్థితి కొంచెం కష్టంగా మారింది. మేము చాలా నిరాశ చెందాం అని అన్నారు.
ఇది సూపర్ సండే, దేశమంతా చూస్తోంది. మా మిడిల్ ఆర్డర్ లో ముందు నుంచే సమస్యలు ఉన్నాయి. మీకు తెలుసు, మాకు తెలుసు, అందరూ ఇదే చెబుతున్నారు అని తన నిరాశను వ్యక్తం చేశారు.
Also Read:స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

