మెగాస్టార్ చిరంజీవి హీరోగా శరవేగంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతుండగా ఇటీవలె ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చారు చిరు. ఉయ్యాలవాడ వర్దంతి సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ ఇదే అసలైన లుక్ అంటూ తెలిపింది.
చిరు కొత్త లుక్‌ని ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్‌కు నిజంగానే ఇది చేదు వార్త. ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్ బీదర్‌లోని బహమని కోటలో జరుగుతోంది. షూటింగ్‌లో భాగంగా కోటలో హిందూ దేవతల విగ్రహాలు నెలకొల్పారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ముస్లిం యువకులు షూటింగ్‌ను అడ్డుకున్నారు. ముస్లింల కోటలో హిందూ దేవతల విగ్రహాలతో షూటింగ్ చేయడమేంటని నిలదీశారు. షూటింగ్ చేయడానికి వీలులేదంటూ బీష్మించుకుని కూర్చోవడంతో చేసేదెమీ లేక సైరా టీం నిరాశగా వెనుదిరిగింది.
చిరు డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ సినిమా తెరకెక్కుతుండగా భారీ అంచనాలున్నాయి. చిరంజీవి ఇమేజ్‌కు తగినట్లుగా ప్రతి సీన్ ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నాడు. నిర్మాత రామ్‌చరణ్ ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
చిరుకు జోడీగా నయనతార నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపుగా ‘సైరా’ చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. అయితే ఈ నేపథ్యంలో షూటింగ్‌కు బ్రేక్ పడటంతో ఫ్యాన్స్ ను నిరాశపర్చింది.