బాలీవుడ్‌ అంటేనే మోజు…!

249
shocking rumours on Shruti Hasan?
- Advertisement -

బాలీవుడ్ మూవీ ‘లక్’ తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శృతిహాసన్‌. విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి మొదటి సినిమా లక్‌ను తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురైనా.. పపన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్‌తో తొలి బ్లాక్ బస్టర్‌ను అందుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది శృతి. వరుస విజయాలు లేకపోయినా అమ్మడు ఒక్కో ఏడాది.. కనీసం ఒక్కో సక్సెసైనా పొందుతూ వచ్చింది. గతేడాది కూడా ప్రేమమ్‌తో హిట్ అందుకున్న శృతికి ఈ ఏడాది మాత్రం అసలు అచ్చిరాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎస్-3 మూవీతో మొదలైన పరాజయాల పరంపర లెటెస్ట్‌ కాటమరాయుడు మరింతగా బలపడింది.

దీంతో ఇటు టాలీవుడ్‌లోను అటు  బాలీవుడ్‌లోనూ అ అమ్మడికి బ్యాడ్ టైమే నడుస్తుంది. తెలుగులో హిట్ ట్రాక్ మీద ఉన్నప్పుడు దాన్ని వదిలి బాలీవుడ్‌ మోజులో పడి.. అక్కడ హిట్ పడకపోయేసరికి ఎటూ తేల్చుకోలేకపోతుంది ఈ  ముద్దుగుమ్మ. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏ హీరోయిన్‌ అయినా అన్ని భాషల్లో నటించి పేరు తెచ్చుకోవాలని ఆరాటపడుతుంది. కానీ ఒక భాషలో సక్సెస్ వచ్చిందంటే  మిగిలిన భాషల్లో నటిస్తునే ప్రయారిటీ మాత్రం తనకు సక్సెస్ వచ్చిన ఇండస్ట్రీకే ఇస్తారు.

shocking rumours on Shruti Hasan?
ఇప్పటివరకు అందరు హీరోయిన్ల విషయంలో జరిగింది కూడా అదే. అనుష్క, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ వంటి తారలు మిగతా భాషల కంటే తెలుగులోనే ఎక్కువగా నటిస్తుంటారు. బాలీవుడ్ అవకాశాలు వస్తే అప్పుడు ఆలోచిద్దాం అన్నట్లుగానే వ్యవహరించారు కానీ పెద్దగా ఆ వైపు ఆసక్తి చూపలేదు. ఎందుకంటే వారి మొదటి ప్రయారిటీ తెలుగు చిత్రసీమకే.

ఇక నయనతార, హన్సిక వంటి తారలు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ అనిపించుకున్నారు. ఈ కథానాయికలు ఇతర భాషల్లో నటించినప్పటికీ తమకు ఎక్కువ సక్సెస్ లను ఇచ్చిన ఇండస్ట్రీనే ఎక్కువగా గౌరవించారు.

అయితే శృతిహాసన్ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి మొదటి నుండి బాలీవుడ్ మీదే మోజు పడింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చినా..వద్దనుకుంటోంది. ఎందుకంటే ఇప్పటికి ఆమెకు బాలీవుడ్‌పై మోజు తగ్గలేదంట. అయితే, ఇప్పుడు ఇదే ఆ అమ్మడు కొంప ముంచేదాక తీసుకొచ్చింది. ఇటు సౌత్‌లో స్టార్ డమ్‌ను పోగొట్టుకొని హిందీలో కూడా పేరు తెచ్చుకోలేక ఎటు అవకాశాలు లేకుండా ఖాళీగా మిగిలిపోయింది. మరి ఇకనైనా అమ్మడు తన కెరీర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుందేమో చూడాలి.

- Advertisement -