నయన్ కావాలంటే.. 4కోట్లు పెట్టాలి

411
nayanthara
- Advertisement -

సినిమా బడ్జెట్ పెరిగిపోయింది బాబోయ్’ అని ఓవైపు నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ‘మా పారితోషికాలు ఇంకా పెంచాల్సిందే’ అని మరోవైపు తారలంతా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం సినిమా బడ్జెట్ లో దాదాపు 75% పారితోషికాలకే సరిపోతుంది అనేది కాదనలేని వాస్తవం.

హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు, మిగిలిన సాంకేతిక విభాగానికీ… పారితోషికాల పేరుతో కోట్లు కుమ్మరించి…ఆ తరవాత మిగిలిన దాంతో సినిమా తీస్తున్నారు. పేరున్న ఏ హీరో కూడా రూ.4 నుంచి 9 కోట్లకు తగ్గడం లేదు. రాజమౌళి, పూరి జగన్నాథ్, వినాయక్, శ్రీనువైట్ల మొదలైన దర్శకులంతా కోట్లకు పడగలెత్తినవారే.

nayanthara

ఇప్పుడు కథానాయికల వంతొచ్చింది. ఒక్క విజయం చేతికి చిక్కగానే హఠాత్తుగా వారి కాల్షీట్లకూ రెక్కలొచ్చేస్తున్నాయి. అందుకే మన కథానాయికలూ… కోట్లాట ఆడుతున్నారు.నయనతార, అనుష్కలు ‘కోటి’ తీసుకొంటున్నారంటే…’అమ్మో’ అనుకొన్నాం. ‘అంతెందుకు ఉంటుందిలెండీ? ! అంతా ఉత్తుత్తినే’ అనిపించింది. కానీ ఇప్పుడు స్టార్ హోదా తెచ్చుకొన్న కథానాయికలెవ్వరూ కోటికి తగ్గడం లేదు.

nayanthara

ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ ఎవ‌రు అంటే అంద‌రి నోటి వెంట వినిపించే ఒకే ఒక పేరు న‌య‌న‌తార‌. సినిమా ప్రమోషన్లకు హాజరుకాదని, డేట్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందని…ఆమె రేటు చాలా ఎక్కువ‌ని ఆ అమ్మ‌డిపై లెక్క‌లేన‌న్ని విమ‌ర్శ‌లు ఉన్నాయి.అయినా న‌య‌నకు ఉన్న డిమాండ్ మరే హీరోయిన్‌కు లేదంటే అతిశ‌యోక్తి కాదు.

ముద్దుగుమ్మ నయనతార చాలా కాస్లీ అన్న విషయం తెలిసిందే. ఆమె రేటు మినిమమ్ కోటీపైనే. ఇప్పుడు కోటి.. కోట్లు దాటాయి. నయన్ ని తీసుకుంటే నరకం చూడాల్సిందేననే భయంకరమైన రూమర్ హల్ చల్ చేస్తోన్నా.. ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక తమిళంలో నయన్ కి ఎదురే లేకుండా పోతోంది. ఇటీవల కాలంలో అక్కడ ఆమె నటించిన చిత్రాలు అన్ని దాదాపు బ్లాక్ బాస్ట‌ర్ నిలిచాయ్.

nayanthara

దీంతో.. త‌న పారితోషికాన్ని అమాంతం పెంచేసింది నయన్. ప్ర‌స్తుతం ఆమె ఒక్కో సినిమాకు రూ.4కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.న‌య‌న‌తార‌కు గ‌త మూడు సంవ‌త్స‌రాల్లో వ‌రుస‌గా 9 హిట్లు వ‌స్తే జీవాతో లేటెస్ట్‌గా చేసిన సినిమా ఒక్క‌టే ప్లాప్ అయ్యింది. న‌య‌న‌తార ఉందంటే సినిమా హిట్టే అన్న టాక్ వ‌చ్చేసింది. దీంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆమెకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఆమె అడిగినంత రేటు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.

nayanthara

ప్ర‌స్తుతం డోర‌, కాష్మోర చిత్రాల‌తో బిజీగా ఉంది నయన్. ఈ చిత్రాల కోసం కూడా భారీగా పారితోషికం తీసుకున్నట్టు వినికిడి. ఇక, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది నయన్. ఇందులో హీరో కూడా ఆమె కావడంతో భారీగా గిట్టుబాటు అవ్వడంతో పాటు.. క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకోవచ్చని నయన్ ప్లాన్ లా కనిపిస్తోంది.

nayanthara

ఈ నేప‌థ్యంలోనే ఓ స్టార్ హీరోతో స్టార్ డైరెక్ట‌ర్ డైరెక్ట్ చేసే సినిమాలో న‌టించాల‌ని ఆమెను అప్రోచ్ అయ్యార‌ట‌. అయితే ఆమె త‌న‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా రూ.4 కోట్ల‌కు త‌క్కువ ఇస్తే తాను ఈ సినిమాలో న‌టించ‌న‌ని తెగేసి చెప్పింద‌ట‌. దీంతో స‌ద‌రు పెద్ద హీరో, స్టార్ డైరెక్ట‌ర్ న‌య‌న డిమాండ్ చూసి షాక్ అయ్యార‌ట‌. ఏదేమైనా నయన్ రోజు రోజుకి మరింత కాస్లీగా మారిపోతోంది.

- Advertisement -