పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్‌మాలిక్ వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ప్రపంచకప్‌లో బంగ్లాతో మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా పాక్ ఆటగాళ్లు మాలిక్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.
మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో భారత టెన్నిస్ స్టార్ సానియామిర్జా స్పందించింది. మాలిక్ పట్ల గర్వంగా ఉందని తెలిపింది.ప్రతీ కథకి ఒక ముగింపు ఉంటుంది. జీవితంలో ప్రతీ ముగింపునకూ కొత్త అవకాశం ఎదురుచూస్తుందని పేర్కొంది. 20 ఏళ్ల పాటు నీ దేశం తరఫున ఎంతో నిబద్ధతతో వినయంగా ఆడావు. నువ్వు సాధించిన వాటికి నేను, ఇజాన్ ఎంతో గర్వపడుతున్నాం అని తెలిపింది సానియా.
సుదీర్ఘకాలం పాక్‌కు సేవలందించిన మాలిక్ ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమయ్యారు. మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఎనిమిది పరుగులే చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుతిరిగాడు.
Hugs galore
Guard of honour
Plenty of applause
Pakistan gave Shoaib Malik a fitting send-off as he retired from ODI cricket
#CWC19 pic.twitter.com/ESA4q1sLUM
— ICC Cricket World Cup (@cricketworldcup) July 5, 2019