భారత జట్టుపై షోయబ్ ప్రశంసలు

2
- Advertisement -

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన తర్వాత మాజీ పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ భారత జట్టును ప్రశంసించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 8న జరిగిన ఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి మూడో టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను దక్కించుకుంది.

ఈ విజయంపై స్పందించిన పాక్ మాజీ ఆటగాడు..షోయబ్ అక్తర్ భారత క్రికెట్ వ్యవస్థను ప్రత్యేకంగా ప్రశంసించాడు. బీసీసీఐ వ్యవస్థ, మెరిట్ ఆధారంగా జరిగే జట్టు ఎంపిక భారత్ విజయానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే జట్టులోని ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంలో భారత క్రికెట్ వ్యవస్థ చాలా పారదర్శకంగా పనిచేస్తోందని అన్నారు.

భారత్ గురించి నేను కొన్ని విషయాలు చెబుతాను. మొదటగా వారి పాలసీ గెలిచింది. తర్వాత వారి వ్యవస్థ గెలిచింది. ముఖ్యంగా మెరిట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు గెలిచాయి. సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు. అభిషేక్ శర్మ ఇంకా యువ ఆటగాడే అయినప్పటికీ చాలా పరిపక్వతతో ఆడాడు అని అఖ్తర్ వ్యాఖ్యానించాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి లెజెండరీ ఆటగాళ్లు జట్టులో లేకపోయినా భారత్ కొత్త ఆటగాళ్లతో వరల్డ్ కప్ గెలవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అలాగే మ్యాచ్ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, కపిల్ దేవ్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఒకే వేదికపై కనిపించడం భారత క్రికెట్‌కు గౌరవంగా నిలిచిందని అఖ్తర్ అన్నారు.

Also Read:ఇంట్రెస్టింగ్‌గా విక్రమ్ ఆన్ డ్యూటీ!

- Advertisement -