ఇది ప్రజాస్వామ్య విజయం:కాంగ్రెస్-శివసేన

501
ncp
- Advertisement -

సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపించిన మహారాష్ట్ర ఎపిసోడ్‌పై సుప్రీం కీలత తీర్పు వెలువరించింది. సీఎం ఫడ్నవీస్‌ను రేపు బలపరీక్షకు ఆదేశించింది సుప్రీం. సాయంత్రం 5 గంటలలోపు బలం నిరూపించుకోవాలని ఆదేశించింది. రహాస్య ఓటింగ్ జరపొద్దని తెలిపింది.

బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని…ప్రొటెం స్పీకర్‌ని వెంటనే నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పుతో బీజేపీకి షాక్ తగిలింది.

మరోవైపు కాంగ్రెస్,శివసేన సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశాయి. తీర్పు చారిత్రాత్మకమని సోనియా గాంధీ అభిప్రాయపడగా ఇది ప్రజాస్వామ్య విజయమని శివసేన పేర్కొంది. బలపరీక్షలో నెగ్గేది శివసేన,కాంగ్రెస్,ఎన్సీపీ కూటమేనని సోనియా తెలిపింది.

Maharashtra government formation: Supreme Court orders open secret ballot; Pro-tem Speaker should be appointed to conduct Floor Test which should be completed before 5 pm tomorrow

- Advertisement -