రష్మి ‘శివరంజని’ నుండి హాట్ సాంగ్..

638
Shivaranjani movie Special Song
- Advertisement -

ఆకట్టుకునే కంటెంట్ ఉంటే హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి మంచి కంటెంట్‌తో వస్తోన్న చిత్రమే ‘‘శివరంజని’’. హాట్ బ్యూటీ రష్మి గౌతమ్, నందు జంటగా నందినిరాయ్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలోని ఒక హాట్ సాంగ్ ‘పాప్ కార్న్’సాంగ్‌ను సక్సెస్ పుల్ డైరెక్టర్ మారుతి లాంచ్ చేసారు. ఈ సినిమాను జూన్ నెలలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

Shivaranjani movie Special Song

ఈ సందర్భంగా దర్శకుడు మారుతి గారు మాట్లాడుతూ.. ‘‘ ఇంతకు ముందు శివరంజని ట్రైలర్ చూసాను చాలా బాగుంది. హార్రర్ బ్యాక్ డ్రాప్ అనగానే తక్కువ బడ్జెట్ సినిమా అనుకుంటారు. కానీ ఈ సినిమా చాలా రిచ్ గా తీసారు అనిపించింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడం నాకు నచ్చింది. నిర్మాత పద్మనాభరెడ్డి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత,చిన్న సినిమాలకు ఆయన అందిస్తున్న సహాకారం చాలా పెద్దది. ఆయనకు ఈ సినిమా మంచి పేరుతో పాటు లాభాల్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను లాంచ్ చేసిన పాప్ కార్న్ పాట కూడా చాలా ఎంటర్ టైనింగ్ ఉంది. తప్పకుండా శివరంజని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హారర్ బ్యాక్ డ్రాప్‌లో సాగే థ్రిల్లర్ మూవీ శివరంజనిలో నందు, రష్మి గౌతమ్ జంటగా నటిస్తుండగా నందినీరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇతర పాత్రల్లో అఖిల్ కార్తీక్, ధన్ రాజ్, ఢిల్లీ రాజేశ్వరి, నటిస్తున్నారు. యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సురేందర్ రెడ్డి, సంగీతం : శేఖర్ చంద్ర, సమర్పణ : నల్లా స్వామి, పి.ఆర్.ఓ : జి.ఎస్.కే మీడియా, సహనిర్మాత : కటకం వాసు, నిర్మాతలు : ఏ పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు, దర్శకత్వం : నాగ ప్రభాకరన్.

- Advertisement -