గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పవర్ ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీంతో ‘పెద్ది’ భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ చిత్రంలోని ఆయన లుక్‌ను విడుదల చేసింది.
శివన్న ఎంతో సీరియస్‌గా చూస్తున్నట్లుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read:ఫోర్త్ సిటీ టూ అమరావతి..గ్రీన్‌ఫీల్డ్ హైవే

