రాజశేఖర్ కూతురు సినిమాకు రాజమౌళి క్లాప్..

222
- Advertisement -

నటుడు రాజశేఖర్‌ కుమార్తె శివానీ కథానాయికగా వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఆమె తొలి సినిమా షూటింగ్ ఈ రోజు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు కె. రాఘవేంద్ర రావు, కృష్ణంరాజు, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, వి.వి. వినాయక్‌, జీవిత, రాజశేఖర్‌ తదితరులు హాజరయ్యారు.

అడవి శేష్ హీరోగా నటించే ఈ మూవీ హిందిలో సూపర్ హిట్ అయిన 2 స్టేట్స్ కి రీమేక్. అర్జున్ కపూర్ – ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా ఆ సంవత్సరం వచ్చిన టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో వెంకట్ కుంచం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

Shivani's debut film 2 States launched

దర్శకులు కె. రాఘవేంద్రరావు కెమెరా స్విచ్చాన్ చేయగా .. ముహూర్తపు సన్నివేశానికి రాజమౌళి క్లాప్ కొట్టారు. అడవి శేష్ .. శివానిలపై తొలిషాట్ ను చిత్రీకరించారు. కృష్ణంరాజు దంపతులు ఈ సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు అందజేశారు. హిందీలో వచ్చిన ‘2 స్టేట్స్’ గా రిలీజ్‌ చేశారు.. తెలుగులో కూడా అదే టైటిల్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఎం.ఎల్.వి. సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శివానీ తల్లి పాత్రలో అలనాటి నటి భాగ్యశ్రీ నటించనున్నారు.

- Advertisement -