- Advertisement -
ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం శివంగి. దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వంలో తెరకెక్కగా నరేష్ బాబు పి నిర్మాత. మార్చి 7న సినిమా రిలీజ్ కానుండగా ఈ చిత్రానికి ఏ.హెచ్.కాషిప్, ఎబినేజర్‌పాల్ సంగీతాన్నందించారు.
థియేటర్‌లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఆహా ఎక్స్ వేదికగా ప్రకటించింది.
Also Read:ఈడి ఆఫీస్.. టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా
ప్రస్తుతం తెలుగు వెర్షన్ మాత్రమే అందుబాటులో రాగా రేపటినుంచి తమిళం వెర్షన్ కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది.
- Advertisement -

