జగన్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

2
- Advertisement -

మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన జగన్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగకూడదని, అలాంటి వారిని రాజకీయాల నుంచి తప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరనున్నట్లు శివాజీ తెలిపారు.

తన తాజా సినిమాపై కూడా జగన్ అనుచరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శివాజీ ఆరోపించారు. ‘పేటీఎం బ్యాచ్’ ద్వారా సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నారని, సినిమా విడుదలకు ముందే చెడు రివ్యూలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఉద్దేశపూర్వకంగా తన సినిమాను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

“నా సినిమాను ఆపగలరేమో కానీ, శివాజీని మాత్రం ఎవరూ ఆపలేరు” అంటూ శివాజీ ఘాటుగా స్పందించారు. గతంలో జగన్ అధికారంలో ఉన్న సమయంలో కూడా తనను ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు తనను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజల ముందు నిజాలు చెప్పడమే తన లక్ష్యమని, ఎవరి ఒత్తిడికైనా తాను తలవంచబోనని శివాజీ స్పష్టం చేశారు. తనపై లేదా తన సినిమాపై ఎంత ప్రచారం చేసినా తాను వెనక్కి తగ్గబోనని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. శివాజీ చేసిన ఆరోపణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

Also Read:ఇంట్రెస్టింగ్‌గా విక్రమ్ ఆన్ డ్యూటీ!

- Advertisement -