సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి తర్వాత రోబో సీక్వెల్ 2.0 షూటింగ్ పూర్తి చేసేసిన సంగతి తెలిసిందే..రజినీ మరో సినిమా ‘కాలా’ షూటింగ్‌ను ప్రారంభించి ఇప్పటికే కొంత భాగాన్ని ముంబైలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ కూడా జరుకుంది. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర కథ.. ముంబై గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో సాగనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త వార్త వినిపిస్తుంది.
ఈ సినిమాలో అరవింద్ అనే తమిళ నటుడు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఆయన పాత్రకి శివాజీరావు గైక్వాడ్ అనే పేరు పెట్టారట. ఇది రజనీకాంత్ అసలు పేరనే సంగతి తెలిసిందే. ఈ విషయం బయటికి వచ్చిన దగ్గర నుంచి రజనీ అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. రజనీ సినిమాలో ఆయన పేరుతో మరో నటుడు కనిపించనుండటం పట్ల వాళ్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ పాత్రను ఎలా మలిచి వుంటారనే ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఇప్పటివరకూ రజినీ అసలు పేరు నుంచి కొంత భాగం తీసుకుని.. శివాజీ అంటూ శంకర్ సినిమాలో మాత్రమే ఉపయోగించారు. అలాగే కాలా చిత్రంలో మరో పాత్ర కూడా ఆసక్తి కలిగిస్తోంది. పొలిటికల్ లీడర్ రోల్ లో కనిపిస్తున్న నానా పటేకర్ కు భీమ్ జీ అనే పేరు పెడుతున్నట్లు తెలుస్తోంది.ఈ పేరు పెట్టడానికి కారణం.. పా రంజిత్ ట్విట్టర్ ఖాతా పేరు భీమ్ జీ కావడమే అసలైన విశేషం.ఈ మూవీకి రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.