‘మా’ అధ్యక్షుడిగా శివాజీరాజా…

188
Shivaji Raja Elected As MAA President
- Advertisement -

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)అధ్యక్షుడిగా శివాజీరాజా ఎన్నికయ్యారు. శివాజీరాజాను మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నటుడు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. ‘మా’ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ పదవీకాలం ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 250 చిత్రాలకుపైగా నటించి శివాజీరాజా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ‘మా’ ప్రధాన కార్యదర్శిగా నరేశ్ ఎన్నికయ్యారు.

గడిచిన రెండేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, పేద నటీనటులకు ఆర్థిక సాయం, హెల్త్‌కార్డులు, పెన్షన్లు అందిస్తున్నామని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శివాజీరాజా తెలిపారు. గత ఎన్నికల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేశాం. కానీ ఈ దఫా ఎలాంటి పోటీ లేకుండా కొత్త కమిటీ ఎన్నికకు అందరు సహకరించారని తెలిపారు.  ఏదైనా ఆపద వస్తే మా ఉందనే ధైర్యంతో కళాకారులందరూ బ్రతకాలి అన్నారు .

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ కొత్త కమిటీ అధ్యక్షుడిగా శివాజీరాజా పేరును మా కమిటీ, ఈసీ మెంబర్లు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. దీనికి మా సభ్యులు, సలహాదారులు అంగీకరించారు. మా జనరల్ సెక్రటరీగా నా పేరును కూడా ప్రతిపాదించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మా వైస్ ప్రెసిడెంట్ శివకృష్ణ, ఈసీ మెంబర్లు గీతాంజలి, ఏడిద శ్రీరాం, గౌతమ్‌రాజు, హరనాథ్ బాబు, హేమ, జయలక్ష్మి, మానిక్, నర్సింగ్ యాదవ్, సురేష్ కొండేటి, పి.శ్రీనివాసులు, శ్రీశశాంక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -