వర్మకు మెంటల్‌ అంటున్న శివాజీ రాజా..

246
Shivaji Raja Comments on Ram Gopal Varma
- Advertisement -

కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్రెస్ గా మారిన వ‌ర్మ సోష‌ల్ మీడియా ద్వారా ఎప్పుడు వార్త‌ల‌లో నిల‌వాల‌ని భావిస్తుంటాడు. అందుకే స‌మాజంలో జ‌రిగిన ప్ర‌తి విష‌యంపై త‌న దైన స్టైల్ లో కామెంట్స్ చేస్తుంటాడు. తాజాగా డ్ర‌గ్స్ కుంభ‌కోణంకి సంబంధించి ఫేస్ బుక్ లో వ‌ర్మ కొన్ని వ్యాఖ్య‌లు చేశాడు. అయితే వర్మ వ్యాఖ్యలపై శివాజీ రాజా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. వర్మకు మెంటల్ అని.. ఆయన్ని డాక్టర్లకు చూపించాలని శివాజీ రాజా అనడం గమనార్హం. టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసుకు సంబంధించి వర్మ మొదట్నుంచి ప్రభుత్వం మీద.. పోలీసు అధికారుల మీద విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

 Shivaji Raja Comments on Ram Gopal Varma

తాజాగా ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు.. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాస్తూ.. ఇండస్ట్రీలో కొందరు డ్రగ్స్ చీడపురుగులున్న మాట వాస్తవమే అంటూ లేఖ రాయగా.. దానిపై వర్మ విరుచుకుపడ్డాడు. ప్రభుత్వానికి మీరెందుకు సారీ చెబుతారు.. మీరెలా ఇండస్ట్రీ వాళ్లు తప్పు చేశారని ఒప్పుకుంటారని ప్రశ్నించాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు నిర్దోషులని తేలితే వాళ్లకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశాడు.

Shivaji Raja Comments on Ram Gopal Varma

దీనిపై శివాజీ రాజా స్పందిస్తూ.. వర్మకు నిజంగానే మెంటల్ అని.. ఆయన్ని పిచ్చాసుపత్రిలో చూపించాలని.. ఒకరు కాదు ఇద్దరు వైద్యులకు ఆయన్ని చూపించడం అవసరమని అంటూ విరుచుకుపడ్డాడు. పోలీసు అధికారుల్ని రెచ్చగొట్టడం మంచిది కాదని.. వర్మ సైలెంటుగా ఉండాలని శివాజీ రాజా కౌంటర్ ఇచ్చాడు. ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మను శివాజీ రాజా తీవ్ర పదజాలంతో ఏకేశాడు. ఇంతకుముందే ఒకసారి వర్మపై విరుచుకుపడ్డాడు శివాజీ రాజా. వర్మ ఇండస్ట్రీకి చేసిందేమీ లేదని.. వర్మ మాటల్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని శివాజా రాజీ అభిప్రాయపడ్డాడు.

- Advertisement -