బండ్ల గణేష్..అందరివాడు!

5
- Advertisement -

బండ్ల గణేషన్న అందరి వాడు అన్నారు నటుడు శివాజీ. ఆయనకు పార్టీలతో సంబంధం లేదు … ఏదైనా తప్పు చేస్తే తప్పు చేశానని ధైర్యంగా ఒప్పుకునే నిజాయితీ పరుడు బండ్ల గణేష్ అని కొనియాడారు.

చంద్రబాబు… బండ్ల గణేష్ కి చేసేందేమీ లేదు … కానీ సమాజానికి ఎంతో మంచి చేసిన చంద్రబాబు అరెస్ట్ అవడంతో ఆయన బయటికి రావాలని దేవుడికి మొక్కాడు అన్నారు.

ఈ దేశంలోనే అత్యంత గొప్ప నాయకుల్లో చంద్రబాబు ఒకరు అన్నారు బండ్ల గణేష్. అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఎంతో బాధపడ్డాను ..జైలు నుంచి చంద్రబాబు బయటికి వస్తే తిరుమలకు నడిచి వస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను అన్నారు.

మొక్కిన నాలుగు రోజులకే చంద్రబాబుకి బెయిల్ వచ్చి బయటికొచ్చారు …గత వారమే ఆ కేసును పూర్తిగా కొట్టేశారు …అందుకే సంకల్ప యాత్ర చేస్తున్నాను అన్నారు.
20 రోజుల్లో తిరుమలకు నా పాదయాత్ర పూర్తవుతుంది అన్నారు బండ్ల.

Also Read:థైరాయిడ్..బరువు పెరగడానికి కారణమా?

- Advertisement -