TG:డీజీపీగా శివ‌ధ‌ర్ రెడ్డి

5
- Advertisement -

తెలంగాణ డీజీపీగా శివ‌ధ‌ర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారింగా ఉన్న శివ‌ధ‌ర్ రెడ్డి ప్ర‌స్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప‌ని చేస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ డీజీపీగా శివ‌ధ‌ర్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్‌ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి ప్ర‌వేశించారు. ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పని చేశారు. 2016 నయీం ఎన్‌కౌంట‌ర్‌లో ఆపరేషన్‌ను ప్లాన్ చేశారు.

ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలో కూడా శివ‌ధ‌ర్ రెడ్డి పని చేశారు. నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పని చేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను పర్యవేక్షించారు. 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పులలో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా శివధర్ రెడ్డిని ప్ర‌భుత్వం నియ‌మించింది. గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్యసమితి మెడల్ సహా అనేక అవార్డుల‌ను శివ‌ధ‌ర్ రెడ్డి అందుకున్నారు.

Also Read:పూరి బర్త్‌ డే..టైటిల్ రివీల్!

- Advertisement -