మెగాస్టార్‌ మాజీ అల్లుడు మృతి!

7
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్‌ భరద్వాజ్‌ కన్నమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమసతో బాధపడుతున్నారు. లంగ్స్‌ డ్యామేజ్ తో హైదారాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.

శిరీష్ భరద్వాజ్.. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ ని 2007 ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నేళ్లకు వీరిద్దరూ విడిపోయారు. ఈ జంటకు ఓ పాప నివ్రతి ఉంది. ఆ తర్వాత శిరీష్‌ రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక శిరీష్‌తో విడిపోయిన అనంతరం హీరో కల్యాణ్‌ దేవ్‌ను శ్రీజ రెండో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కూడా నవిష్క అనే పాప ఉంది.

Also Read:Revanth:రుణమాఫీ డేట్ ఫిక్స్!

- Advertisement -