- Advertisement -
కరోనా నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్,థియేటర్స్ మూతపడగా దేవాలయాలపై కూడా ఈ ప్రభావం పడింది. ఏప్రిల్ 2న భద్రాద్రిలో జరిగే శ్రీరామ నవమి వేడుకలు భక్తులు లేకుండానే నిర్వహించనున్నట్లు తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్. కరోనా వ్యాప్తి దృష్ట్యా కేవలం ఆలయ ప్రాంగణంలోనే వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇక మరోవైపు కరోనా ఎఫెక్ట్‌తో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయాన్ని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆలయాన్ని ట్రస్ట్ అధికారులు మూసివేయనున్నారు.
ఇప్పటికే ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయం, ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా మూసేశారు. కరోనా ఎఫెక్ట్ అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -