- Advertisement -
కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ థియేటర్లు తెరచుకుంటాయో లేదో తెలియని పరిస్ధితి నెలకొనగా ప్రస్తుతం సినిమాలన్నీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ రకరకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా తాజాగా షెమరూ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. రూ. 100 చెల్లించి మూడు రోజుల పాటు ఎన్నిసార్లైనా కొత్త మూవీని చూసే వెసులుబాటు కల్పించింది.
ఇందుకోసం పే పర్ మూవీ సర్వీస్‌ను ఆవిష్కరించింది. షెమరూమీ బాక్సాఫీస్ వెబ్సైట్లో సినిమాలు చూసే సదుపాయం కల్పించగా టికెట్లను బుక్‌మైషో లేదా షెమరూమీ వెబ్సైట్లలో బుక్ చేసుకోవచ్చు. అంటే రూ.100తో ఇంట్లో వారంతా సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.
- Advertisement -