శేఖర్ కమ్ముల @ వస్తున్నా…వచ్చేస్తున్నా

93
shekar
- Advertisement -

కార్తీక్ రాజు హీరోగా తేజస్వి క్రియేటివ్ వర్క్స్‌ పతాకంపై సందీప్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వస్తున్నా….వచ్చేస్తున్నా. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు దర్శకుడు శేఖర్ కమ్ములా. కార్తీక్ సరసన మిస్తి చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా శేఖర్‌కమ్ముల మాట్లాడుతూ..‘కార్తీక్‌రాజునటించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ఇంప్రెసివ్‌గా వుంది. చిత్రం కూడా ప్రేక్షకులను అలరించేలా వుంటుందని అనుకుంటున్నాను. ఈ సినిమా విజయం సాధించి అందరికి మంచిపేరును తీసుకరావాలని ఆశిస్తున్నాను’ అన్నారు.

దర్శక నిర్మాత సందీప్‌ గోపిశె ట్టి మాట్లాడుతూ…‘ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ములతో మా ఫస్ట్‌లుక్‌ విడుదల కావడం ఆనందంగా వుంది. ఇది మా విజయానికి శ్రీకారంలా భావిస్తున్నాం. పూర్తి కమర్షియల్‌ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ఇది. ఆడియన్స్‌ సర్‌ఫ్రైజ్‌గా ఫీలయ్యే ఎ న్నో అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయన్నారు.

- Advertisement -