శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం నీదీ నాదీ ఒకే కథ. మార్చి 23న ప్రేక్షకుల ముందు రానుండగా విడుదలకు ముందే హైప్ క్రియేట్ అయిన ఈ సినిమాపై ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇది మనందరి కథ…చాలా అవసరమైన కథ. చాలా పరిణితితో అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వేణు ఊడుగులకు హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. శ్రీ విష్ణు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అతని రాయలసీమ యాస డైలాగుల్ నవ్విస్తూనే ఆలోచింప చేస్తాయన్నారు.
సొసైటీ పరంగా పిల్లలకుండే ప్రెషర్,చదువుల గురించి గాని,సెటిల్మెంట్ గురించి గాని చాలా బాగా చూపించారు. వాళ్ళేదో సాధించాలని,తల్లిదండ్రులను మెప్పించాలన్న తపనొక్కటే గోల్ అయిపోయే విధంగా తయారైపోయిన ఈ సిస్టంని బాగా చూపించారు. తండ్రి కొడుకుల రిలేషన్ షిప్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు యాక్టింగ్ ముందు సినిమాలకంటే ఒక నాచ్ ఎక్కువనే చెప్పాలి. తను మాట్లాడిన రాయలసీమ యాస నవ్విస్తూ,ఏడిపిస్తూ అలా సైమల్టేనియస్‌గా ఉంటుంది. ఇలాంటి సినిమాలు తప్పకుండా రావాలి,ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా అవసరమున్న సినిమా…అందరు చూడాలి…తప్పకుండా చూస్తారని హోప్ చేస్తున్నాని తెలిపారు శేఖర్ కమ్ముల.