బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ భారతీయ చిత్ర పరిశ్రమని ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఆమె అద్భుతమైన బాడీ షేప్ తో, జీరో ఫిగర్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ఇటీవల తుషార్ కపూర్ కుమారుడు లక్ష్య తొలి పుట్టిన రోజు వేడుకలో కరీనా కపూర్ అందం చూసి పలువురు ప్రముఖులు ఆశ్చర్యానికి గురయ్యారట. కుమారుడు తైమూర్ పుట్టిన తర్వాత బాలీవుడ్ దూరమైన కరీనా.. పాగా వేసేందుకు కరీనా కపూర్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నది. గత మూడు నెలల్లో దాదాపు 16 కేజీల బరువు తగ్గింది. అందుకోసం కఠినమైన వర్కవుట్లు చేసింది. అసలు కరీనా అందం ఇప్పటిది కాదట. తొమ్మిదేళ్లప్పుడే హీరోయిన్లా ఉండేదని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వెల్లడించాడు. ట్యూబ్‌లైట్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాన్ని సల్మాన్ తెలిపాడు.
ఈ సందర్భంగా వ్యాఖ్యాత.. సల్మాన్‌కు కరీనా కపూర్ చిన్ననాటి ఫొటోలను చూపిస్తూ కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ ఫోటోలో ఉన్న కరీనాకి అప్పుడు తొమ్మిదేళ్ల వయసు. ఇందులో సల్మాన్ ఆమెతో మాట్లాడుతున్న మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ ఫొటోని సల్మాన్ గుర్తుచేసుకుంటూ.. ‘కరీనాకి అప్పుడు తొమ్మిదేళ్లు. తను అప్పటికే పెద్దస్టార్లా కన్పించింది. ఉడిపిలో దిగిన ఫొటో అది. అప్పుడు నేను, కరీనా సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కూర్చున్నాం. కానీ అదే పిల్లతో నేను ‘బాడీగార్డ్’, ‘బజరంగీ భాయ్‌జాన్’ సినిమాలు చేస్తానని అస్సలు అనుకోలేదు.’ అని చెప్పుకొచ్చారు.
మరోవైపు కబీర్‌ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ నటించిన ‘ట్యూబ్‌లైట్’ చిత్రం శుక్రవారం విడుదల కాబోతోంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఏక్ థా టైగర్’, ‘బజరంగీ భాయిజాన్’లు బాక్సాఫీస్ బద్దలు కొట్టాయి. ఈ క్రమంలో తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.