డేవిడ్.ఎఫ్.సాండ్ బర్గ్ (“ఆనాబెళ్ : క్రియేషన్”) న్యూ లైన్ సినిమా వారి “షజామ్” కి దర్శకత్వం వహిస్తున్నాడు..దీని అసలైన కథలో నటించిన వారు జకరి లేవి (టీవీ లో చక్) డీసీ సూపర్ హీరోగా నటిస్తున్నాడు..సూపర్ విలన్ డాక్టర్ థాడ్దెస్ శివానా గా మార్క్ స్ట్రాంగ్ (“ది కింగ్స్ మాన్ మూవీస్”) నటిస్తున్నాడు..బిల్లీ బ్యాట్సన్ గా యాషెర్ ఏంజెల్ (“టీవీ లో ఆండీ మాక్”) నటిస్తున్నాడు..ఈ చిత్రానికి నిర్మాత పీటర్ సఫ్రన్ (“ఆక్వా మాన్, ది కాంజూరింగ్, అండ్ అనాబెల్ ఫిలిమ్స్”).
మన అందరిలోనూ ఒక సూపర్ హీరో ఉంటాడు..దాన్ని మేజిక్ తోనే బయటకి తీసుకు రాగలం..బిల్లీ బాట్సన్ (“ఏంజెల్”) విషయం లో…షజాం అని ఒక్క సారి అరిస్తే చాలు, ఫాస్టర్ హోంలో పెరుగుతున్న ఈ 14 ఏళ్ళ కుర్రాడు అడల్ట్ సూపర్ హీరో షజాం గా (లెవి) గా మారిపోతాడు..దుష్టశక్తుల భరతం పడుతుంటాడు.
డీసీ యూనివర్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నప్పటికీ తన సొంత స్టయిల్లో ఫామిలీ ఆడియన్స్ కి నచ్చేలా తీయబడుతోన్ది.. దీనికి స్క్రీన్ ప్లే హెన్రీ గైడెన్, కథ గైడెన్ మరియు డారెన్ లెమ్క్..డీసీ పాత్రల ఆధారం గా ఈ పాత్రలు రూపొందించబడ్డాయి.. జాక్ డైలాన్ గ్రేజర్, డిజిమాన్ హాన్సు (బ్లడ్ డైమండ్ ) తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.