ఏం ఉంటే సంతోషంగా ఉంటామో.. అదే ‘షష్టిపూర్తి’

1
- Advertisement -

రూపేష్ కథానాయకుడిగా మా ఆయి (MAA AAI) ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా ‘షష్టిపూర్తి’. నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న అర్చన ఇందులో ప్రధాన తారాగణం. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ విడుదలైన 38 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్షా సింగ్ ఇందులో రూపేష్ సరసన కథానాయికగా నటించారు. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. ఈ చిత్ర గ్లింప్స్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో టీమ్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా నట కిరీటీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘షష్టిపూర్తి.. ఈ అదృష్టం నా ఒక్కడికేనా.. లేదంటే ఇంకెవరికైనా ఉందా? మీడియా వాళ్లని మీడియా మిత్రులు అని అనను. దాదాపు వారు కూడా నాతో పాటు 40, 30 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు. అందుకే మీడియా సోదరులు అని అంటాను. వారంతా నాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే.. ఆ భగవంతుడు నాకిచ్చిన అదృష్టం అని అనుకుంటాను. అదృష్టం ఏమిటని అనుకుంటున్నారా? వయసుకు తగినట్లుగా పాత్రలు. రాజేంద్ర ప్రసాద్‌కు షష్టిపూర్తి. నిజ జీవితంలో నాకు అరవై దాటిన తర్వాత షష్టిపూర్తి పెట్టకుండా తప్పించుకున్నాను. కానీ భగవంతుడు ఊరుకుంటాడా? ఇదిగో ఇలా షష్టిపూర్తి చేశాడు. ఇది సినిమా కాదు.. జీవితం. మీ అందరి ఇళ్లలోని వస్తువును అయిపోయాను నేను. పీవీ నరసింహారావుగారు.. ప్రధానిగా చేశారు దేశానికి. ఆయన ఏమనేవారో తెలుసా.. ‘ఇంట్లో కంచం ఉంటాది.. మంచం ఉంటాది.. ప్రసాదు ఉంటాడు’ అని అనేవారు. నిజంగా నేను ‘ఆ నలుగురు’ తర్వాత చేసిన సినిమాలు భగవంతుడు వేసిన భిక్ష అనే అనుకోవాలి. నిజంగా ఈ సినిమాలో పనిచేసిన నేను కాదు.. అందరూ కూడా గర్వపడే సినిమా. ఎందుకంటే, సినిమా మారిపోయింది. సినిమా ఇంటికి వచ్చేసింది. ఓటీటీలో రూపంలో ఇంట్లోకి వచ్చేసింది. థియేటర్ల నుండి ఇంటికి వచ్చేసింది. ఒకప్పుడు నా సినిమాల గురించి ఏం మాట్లాడుకునే వారంటే.. ఇది రాజేంద్రపసాద్ సినిమానా? అయితే కారు పెట్టడానికి ప్లేస్ ఉండదండి. ఫ్యామిలీల ఫ్యామిలీలు సినిమాలకు వస్తారనేవారు. ఒక టికెట్ తెగే దగ్గర 10, 12 టికెట్లు తెగేవని అనేవారు. నిజంగా అది నిజమైతే.. ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలి. తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం బిడ్డలకు ఉండదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందీ అంటే అది షష్టిపూర్తి ఒక్కటే. ప్రతి మనిషికి షష్టిపూర్తి చాలా ముఖ్యం. ఒక అద్భుతమైన సినిమా చేసే అవకాశాన్ని నాకు కల్పించాడు దర్శకుడు పవన్. ఫస్ట్ టైమ్ నిర్మాత అయినా కూడా.. ఎక్కడా చిన్న తేడా కూడా జరగకుండా చూసుకున్నాడు. ఇళయరాజాగారు, కీరవాణిగారు, చైతన్యప్రసాద్ ఇలాంటి వారంతా ఈ సినిమాకు పనిచేశారంటే.. నిర్మాతగా అతను ఎంత బాగా చూసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇందులో నటించిన వారందరికీ నా మీద ఎంతో ప్రేమ, గౌరవం ఉంది. అప్పటి బ్రహ్మానందం నుండి ఇప్పుడు చంటి వరకు అందరికీ నేనంటే గౌరవం. సెట్స్‌లో కూడా చాలా చక్కటి వాతావరణం ఉండేది. హీరోగా రూపేష్ చాలా చక్కగా నటించాడు. చాలా నేర్చుకున్నాడు. ఆకాంక్ష నాతో ఇంతకు ముందు నా కుమార్తెగా నటించింది. అర్చన.. ‘లేడీస్ టైలర్’ సినిమా అప్పటికే ఆమె మెచ్యూర్డ్ నటి. నన్ను వంశీ ఎంతో భయపెట్టేవాడు. అన్ని సంవత్సరాల క్రితం నటించిన మేము.. మళ్లీ ఇలా కలుసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మా ఇద్దరి పాత్రలు అద్భుతంగా ఉంటాయి. నాకు వర్క్ చేయడం రెస్పాన్సిబిలిటీ. నాకు పాత్ర దొరకడం అదృష్టం. ఇళయరాజా దగ్గరకి వెళ్లి.. ఈ సినిమా పేరు చెప్పి నా పేరు చెప్పగానే ఆయన కూడా షాక్ అయ్యారట. షష్టిపూర్తి ఒక మంచికథ. తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతిని ఇష్టపడేవారు.. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ ఫ్యామిలీతో సహ కలిసి వెళ్లి థియేటర్లలో ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. మన ఇళ్లలో ఏం ఉంటే సంతోషంగా ఉంటామనేది ఈ సినిమా చెబుతుంది.. అందరూ చూడాలని కోరుతూ.. తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికీ పాద నమస్కారాలు..’’ అని అన్నారు.

నటి అర్చన మాట్లాతుతూ.. ‘‘చాలా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మా ఆయి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ రూపేష్ చౌదరి మరియు డైరెక్టర్ పవన్ ప్రభ వీళ్లిద్దరూ కలిసి నాకు ఈ సినిమా ప్రపోజ్ చేసినప్పుడు.. సినిమా పేరు ఏంటి? అని అడిగాను. ‘షష్టిపూర్తి’ అని అన్నారు. నేను ఎవరితో యాక్ట్ చేయబోతున్నాను అని అడిగాను. వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి.. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి తమిళ సినిమాలు హీరోగా మీరెవరు చూసి ఉండరు బహుశా. కానీ నేనెప్పుడూ చూస్తూ ఉంటాను అక్కడ. ఆయన అందరికీ కావాల్సిన నటుడు. ఒక యాక్టర్‌కి ఈ గుర్తింపు చాలా అవసరం. ఆ గుర్తింపుతో ఇప్పటి వరకు ఆయన ఒక లెజెండ్‌గా కొనసాగుతున్నారు. నేను ఇంతకు మించి ఏం చెప్పలేను. తర్వాత ఇళయరాజా గారు ఉన్నారు ఈ సినిమాలో అంటే.. ఆ సినిమాని ఒప్పుకొని ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కరి జీవితానికి ఆయన ఎంతో ముఖ్యం. తోట తరణి గారు. ఆయనతో నాకు ఇదే మొదటి సినిమా. ఆయన ఎంత గొప్ప ఆర్ట్ డైరెక్టరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కాంబినేషన్ గురించి ఆలోచించడమే చాలా అపూర్వంగా అనిపించింది నాకు. ఇంత మంచి కాంబినేషన్‌ని అలోచించి ఒకళ్ళు సినిమాను మా దగ్గరికి తీసుకువస్తున్నారు అని అంటే.. వారికి ఎంత గొప్ప హృదయం ఉందో తెలుస్తుంది. నాకు వాళ్లు సినిమా ఇవ్వడం లేదు. వారి సోల్, హార్ట్‌ని నాకు ఇస్తున్నారనిపించింది. అది నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే నేను ఈ సినిమాలో ఒక భాగమయ్యాను. నిర్మాత, హీరో రూపేష్, దర్శకుడు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్లకి సినిమా అంటే ఎంత ప్యాషనో, ప్రేమో తెలుస్తుంది. ఇలాంటి మంచి విలువలు నేర్పడం మన కర్తవ్యం. అదే మేము చేశాము. ఆకాంక్ష గురించి చెప్పాలంటే. తనని చూస్తుంటే నాకు బాపు గారు గుర్తొచ్చారు. ఎందుకంటే బాపు బొమ్మలా ఉంది. వీళ్లంతా నా బిడ్డల లాంటి వారు. వారందరికీ మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నాకు ఇంత గొప్ప వెల్‌కమ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ’’ అని అన్నారు.

హీరో రూపేష్ మాట్లాడుతూ… ‘‘షష్టిపూర్తి’ నా మొదటి సినిమా. ఈ సినిమా గురించి ఇక్కడున్న అందరూ చెప్పారు. ‘షష్టిపూర్తి’ సినిమాను అందరూ ఆదరిస్తారని, అందరి ఆశీస్సులు మాకు ఉంటాయని కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ’’ అని తెలిపారు.

Also Read:డాకు మహారాజ్..ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

చిత్ర దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ.. ‘‘నేను చాలా మందికి థ్యాంక్స్ కార్డు చెప్పాలి. నాకు ఇంతమంచి సాంకేతిక నిపుణులను ఇచ్చిన నిర్మాత రూపేష్ గారికి థ్యాంక్యూ. ఐ లవ్ యు ఫరెవర్. నా సెకండ్ థ్యాంక్స్.. రాజేంద్రప్రసాద్‌గారికి, అర్చనమ్మగారికి. ఎందుకంటే, ఈ సినిమాలో వారు పవర్ ప్యాక్‌డ్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు. స్క్రీన్ మీద వాళ్లని చూస్తున్నంతసేపు.. రెప్ప కూడా వేయలేరు. నేను ప్రామిస్ చేసి చెబుతున్నాను. గ్లింప్స్ అంతా చూశారు. రెండున్నర గంటల సినిమాను ఒక్క నిమిషంలో చూపించడం కష్టమే కానీ.. మీ అందరికీ గ్లింప్స్ నచ్చిందనే అనుకుంటున్నాను. రూపేష్ సార్ ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. మనం ఏం సినిమా చేసినా అందులో మంచి విలువలు ఉండాలని. మోరల్స్, ఎథిక్స్ ఉండాలి అని చెప్పేవారు. ఈ మూడు ఉన్న సినిమా ఏదైనా సరే.. అలా నిలిచిపోతుంది. నేను అలాంటి సినిమా చేయాలని అన్నారు. అలా ఈ ‘షష్టిపూర్తి’ వచ్చింది. ఇళయరాజాగారికి పెద్ద అభిమానిని నేను. ఆయనకు నేను సీన్ చెప్పడానికి షివరింగ్ వచ్చింది. కానీ వండర్‌ఫుల్ థింక్స్ అంటాం కదా.. అది నేను రాజా సార్‌తో నా లైఫ్‌లో చూశాను. నేను ఏం చెబుతున్నానో కూడా ఆయనకు తెలియదు.. హార్మోనియం ముందు కూర్చుని అప్పటికప్పుడు ట్యూన్స్ ఇచ్చేశారు. నిజంగా నా జన్మ ధన్యమైంది. చైతన్య ప్రసాద్‌గారు నాకు బంగారం లాంటి గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఎవరో కాదు కీరవాణి సార్. రెహమాన్ గారు ఇక్కడకు రాలేదు కానీ.. ఆయన కూడా రెండు మంచి పాటలు రాశారు. డిఓపీ రామ్ ఫెంటాస్టిక్ వర్క్ సార్. ఎడిటర్ కార్తీక్.. అద్భుతంగా సినిమాను డిజైన్ చేశారు. నేను స్క్రిప్ట్ రాసుకునే సమయంలో కూడా జానకి అనే రాసుకున్నా. నా ఫోన్‌లో కూడా హీరోయిన్ పేరు జానకి అనే ఉంటుంది. ఈ రోజుకి కూడా ఆమె పేరు నాకు సరిగా తెలియదు. నేను జానకి అనే ఫిక్సయ్యాను. ఆమె ఇందులో అద్భుతమైన పాత్ర చేశారు. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే చెబుతాను.. థ్యాంక్యూ ఆల్’’ అని అన్నారు.

- Advertisement -