ఒక్క మిస్డ్ కాల్ కూడా రాలేదు:కాంగ్రెస్ ఎంపీ

9
- Advertisement -

కేరళలోని నిలంబూర్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రచారానికి దూరంగా ఉన్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ఈ నేపథ్యంలో ఆయన కీలక కామెంట్ చేశారు. నిలంబూర్ ఉప ఎన్నిక ప్రచారానికి పార్టీ తరపున ఎవరూ తనను ఆహ్వానించలేదని కనీసం ఒక మిస్డ్ కాల్ కూడా రాలేదు అన్నారు.

ఇది నిజమే… నన్ను (ప్రచారం కోసం) ఆహ్వానించలేదు. మీకు తెలిసిందే, నేను సుమారు 16 రోజుల పాటు విదేశాల్లో ఉన్నాను. అయినప్పటికీ, ప్రచారానికి ఆహ్వానం గానీ, ఒక మిస్డ్ కాల్ అయినా గానీ రాలేదు. థరూర్ చెప్పారు.

అయితే నిలంబూర్‌లో కాంగ్రెస్ గెలవాలని నిజంగా కోరుకుంటున్నాను… మా అభ్యర్థి మంచి వ్యక్తి. కార్యకర్తలు చాలా శ్రమించారు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో థరూర్ పేరు 8వ స్థానంలో ఉంది. మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లలో కే.సీ. వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వాద్రా, వి.డి. సతీషన్, రమేశ్ చెన్నితల వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.

Also Read:Mega157:ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

- Advertisement -