రీసెంట్‌గా మహానుభావుడు మూవీతో యంగ్ హీరో శర్వానంద్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. థ్రిల్లర్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో శర్వా డబుల్ రోల్ పోషించనున్నాడని టాక్.
అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నివేదా థామస్‌ను ఫైనల్ చేశారని అలానే మరొక హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారని సమాచారం.
ఈ క్రమంలోనే తాజాగా దర్శకుడు సుధీర్ వర్మ దృష్టి ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ షాలిని పాండే మీద పడింది. మొదటి సినిమాతోనే యూత్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించిన షాలినిని తీసుకోవడం ద్వారా సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాడు దర్శకుడు. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే షాలిని వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా గడుపుతోంది. తమిళంలో 100% రీమేక్‌లో నటిస్తోన్న షాలిని తెలుగులో మహానటి సావిత్రి బయోపిక్‌లో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ క్రమంలో ఇప్పుడు శర్వానంద్ సినిమాలో నటించడానికి అంగీకరిస్తుందో.. లేదో.. చూడాలి!