‘నారి నారి నడుమ మురారి’తో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టారు నటుడు శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో సంక్రాంతి ప్రత్యేకంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది.
ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం నిన్న రాత్రి ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన శర్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత అనిల్ సుంకరాతో తాను చేయబోయే తదుపరి చిత్రానికి ఎలాంటి పారితోషికం తీసుకోనని ప్రకటించారు. అంతేకాదు, అనిల్ సుంకరా భారీ బడ్జెట్ సినిమా నిర్మించే వరకు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయనని స్పష్టం చేశారు.
చార్మింగ్ స్టార్ చేసిన ఈ ప్రకటన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా తమ కాంబినేషన్‌లో మరోసారి సినిమా తప్పకుండా ఉంటుందని కూడా శర్వానంద్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ విజయవంతమైన జోడీ నుంచి మరో హిట్ మూవీ వచ్చే అవకాశం ఉందని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శర్వానంద్ సరసన సమ్యుక్త, సాక్షి వైద్య కీలక పాత్రల్లో నటించగా, నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
Also Read:రిపబ్లిక్ డే ..భద్రత కట్టుదిట్టం!

