శర్వా ‘జాను’ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌ !

205
janu

శర్వానంద్-సమంత హీరో,హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం జాను. తమిళ మూవీ 96కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తమిళ వెర్షన్‌ను తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగులో కూడా డైరెక్ట్‌ చేస్తున్నాడు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేయనున్నారు.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల‌ను విడుద‌ల చేయనున్నారు.