శర్వానంద్‌ ఓ యాఫియా లీడర్‌..

182
- Advertisement -

అవును.. యంగ్‌ హీరో శర్వానంద్‌ ఓ మాఫియా లీడర్‌. కానీ.. అది రియల్‌ లైఫ్‌ లో కాదు.. రీల్ లైఫ్‌లో. ప్రస్తుతం శర్వా హీరోగా మారుతి దర్శకంత్వంలో వస్తున్న సినిమా ‘మహానుభావుడు’. ఈ సినిమా షూటింగ్‌ లో బిజీ బిజీగా ఉన్న శర్వానంద్‌, మరో సినిమాకి కమిట్‌ అయ్యాడు.

ఆ సినిమాలోనే మాఫియా లీడర్‌గా కనిపించనున్నాడు శర్వానంద్‌. ‘మహానుభావుడు’ తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. గతంలో కమల్ హాసన్ నటించిన ‘నాయకుడు’ సినిమాకు దగ్గరగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

  sharwanand is a mafiya don

అయితే ఈ సినిమాలో కూడా ఓ సామాన్య వ్యక్తి మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడనే విషయాన్ని చూపించనున్నారట. అంతేకాకుండా ఈ సినిమాలో శర్వా కొంత సమయం పాటు నలభై ఏళ్ల వయసు గల మాఫియా లీడర్‌గా కనిపించబోతున్నాడని సమాచారం.

శర్వాకి నడి వయసు కలిగిన వ్యక్తి పాత్రలో కనిపించడం కొత్తేమికాదు. గతంలో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలో కూడా శర్వా కొద్దిసేపు నడి వయసు కలిగిన వ్యక్తి పాత్రలో కనిపించాడు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఇప్పుడు మాఫియా లీడర్‌గా కూడా కనిపించడానికి రెడీ అవుతున్నాడు శర్వానంద్‌ .

- Advertisement -