తండ్రి కాబోతున్న యంగ్ హీరో?

36
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా.. ఈ యంగ్ హీరో త్వరలో తండ్రి కాబోతున్నాడంట. పెళ్లైన రెండు నెలలకే తండ్రి కావడం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా? అయితే శర్వానంద్ తండ్రి కావడం అంటే నిజ జీవితంలో కాదంట. త్వరలో రాబోతున్న తన సినిమాలో ఆయన ఒక బిడ్డకు తండ్రి పాత్రలో నటించబోతున్నాడట. అయినా, తండ్రిగా నటించడం శర్వానంద్‌కు కొత్తేమీ కాదు. గతంలో శర్వానంద్ తండ్రిగా నటించి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి తండ్రి పాత్రలో నటించబోతున్నాడు.

అన్నట్టు ఇటు తండ్రిగానే కాదు, అటు కొడుకు పాత్రలో కూడా శర్వానంద్ నటించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘బ్రో డాడీ’ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో చిరంజీవి‌‌కి కుమారుడిగా హీరో సిద్దు జొన్నలగడ్డ నటించబోతున్నట్లుగా మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, సిద్దు ఆ పాత్రలో చేయనని చెప్పడంతో.. ఆ ప్లేస్‌లో శర్వానంద్‌ని ఓకే చేసినట్లుగా టాక్ వినబడుతోంది.

అయితే దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏది ఏమైనా చిరంజీవి కుమారుడిగా శర్వనంద్ నటిస్తే బాగుంటుంది. నిజానికి శర్వానంద్ మొదటిసారి నటుడిగా కనబడింది మెగాస్టార్ చిరంజీవి నటించిన యాడ్ లోనే. ఇప్పుడు మెగాస్టార్ తో ఏకంగా సినిమాలో కలిసి నటిస్తే బాగుంటుంది. ఇక శర్వానంద్ హీరోగా రెండు సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతానికి అయితే.. శర్వానంద్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

Also Read:‘ఖుషీ’ సెన్సార్ పూర్తి..రన్ టైమ్‌ అంతే

- Advertisement -