#Sharwa38..అప్‌డేట్

6
- Advertisement -

చార్మింగ్ స్టార్ శర్వా ఇటీవలే తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని అనౌన్స్ చేశారు. బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించే డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం. 15గా నిర్మించనున్నారు. హై ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో రూపొందే ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.

#Sharwa38 1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా. #Sharwa38 టీం భూమి పూజతో సెట్ వర్క్‌ను ప్రారంభించింది. ఉత్తర తెలంగాణ స్వరూపాన్ని, వరల్డ్ , కల్చర్ ని రీక్రియేట్ చేసే మ్యాసీవ్ సెట్ ని హైదరాబాద్ సమీపంలోని 15 ఎకరాల విస్తీర్ణంలో హై బడ్జెట్ తో ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె రూపొందించారు. పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం నిర్మించిన ఈ మ్యసీవ్ సెట్ మన చరిత్రలోని ఇంపార్టెంట్ టైమ్స్ లోకి ఆడియన్స్ ని తీసుకువెళ్ళనుంది. ఈ సెట్‌లో కొన్ని అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

శర్వా మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నారు. 60ల నాటి పాత్రను పోషించడానికి అద్భుతంగా మేక్ఓవర్‌ అవుతున్నారు. #Sharwa38 అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. సౌందర్ రాజన్ ఎస్ డీవోపీ కాగ, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి పని చేసే తారాగణం, ఇతర ప్రముఖ సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో తెలియజేస్తారు. #Sharwa38 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Also Read:అఖండ 2.. తాండవం

- Advertisement -