అందానికి అందం… నటనకు నటన ఉన్న నటి నిత్యామీనన్.. మాట మాట్లాడినా.. నటించినా అంతే బోల్డ్ గా ఉంటుంది. హైట్ తక్కువైనా… క్యారెక్టర్ లో వెయిట్ ఉన్న నటనను కనబరుస్తూ అందరి మన్ననలు పొందుతోంది ఈ భామ. అక్కడక్కడ లీడ్ హీరోయిన్ గా నటిస్తున్నా… అప్పుడప్పుడూ రెండో హీరోయిన్ గా చేస్తుంది. ఈ కెరళ కుట్టి తను సొంతంగా డబ్బింగ్ చెప్పడంతో పాటు అవసరమైతే గొంతు సవరించుకుని పాటలు కూడా పాడగలదు. ఈ అమ్మడుకు పాత్ర నచ్చితే చిన్నదా… పెద్దదా అన్న తేడా లేకుండా చేసేస్తుంది. తాజాగా ఈ అమ్మడు అదిరింది సినిమాతో అటు కోలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. అయితే తాజాగా ఈ భామ తెలుగులో సోలో హీరోయిన్ గా నటించనున్నట్టు తెలుస్తోంది.
శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో నిత్యా హీరోయిన్ గా నటించనుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి .. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ .. ‘రాజాధి రాజా’ సినిమాలు చేశారు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమా ఈ జంటకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదంటే ఆడియన్స్ మనసులో ఈ ఇద్దరూ ఎంతటి బలమైన ముద్ర వేశారనేది అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈ జంట మూడోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ రోజున ఒక సినిమాను లాంచ్ చేశారు. ఈ జోడీకి యూత్ లో మంచి క్రేజ్ వుంది గనుక, సగం మార్కులను ఈ సినిమా ఇక్కడే సంపాదించుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.