తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చుట్టూ రాజకీయ వేడి కొనసాగుతోంది. తాజాగా ఆమె పోలీసులపై చేయిచేసుకోవడంతో ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సిట్ అధికారులను కలిసేందుకు వెళ్లుతున్న సమయంలో ఆమెకు అనుమతి లేకపోవడంతో పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికి ఆమె పోలీసులను ఖతరు చేయకుండా దురుసుగా ప్రవర్తిస్తూ ఎస్సై మరియు మహిళా కానిస్టేబుల్ పై చేయిచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వీధుల్లో ఉన్న పోలీసులపై ఆమె దాడికి పాల్పడడంతో ఆమెపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.
ఆ తరువాత వైఎస్ షర్మిలను చూడడానికి వచ్చిన ఆమె తల్లి విజయమ్మ కూడా మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడం మరింత హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. కాగా షర్మిల మరియు ఆమె తల్లి విజయమ్మ చేసిన దుశ్చర్యలకు అన్నీ వైపులా నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే అనుమతి లేనప్పుడు భద్రత నిమిత్తం రాజకీయ నాయకులను అడ్డుకోవడం, వారి కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకపోవడం పోలీసుల యొక్క సాధారణ విధి. అలాంటప్పుడు వారి యొక్క బాధ్యతను సవ్యంగా నిర్వహిస్తున్నప్పుడు సహకరించడం మాని చేయిచేసుకోవడం ఏంటని షర్మిల దురుసు వైఖరి పట్ల మండిపడుతున్నారు నెటిజన్స్. అయితే డ్యూటీలో ఉన్న పోలీస్ లపై చేయి చేసుకోవడం చట్టరీత్యా నేరం అనే సంగతి షర్మిల, విజయమ్మలకు తెలియనిది కాదు. అయినప్పటికి దాడికి పాల్పడడంతో ఇది పక్కా వ్యూహమేనా అనే సందేహాలను వెళ్ళబుచ్చుతున్నారు చాలమంది.
Also Read: వామ్మో జగన్ కు ఇన్ని సమస్యలా.. ఇబ్బందే !
పార్టీ పెట్టినది మొదలుకొని ఇప్పటివరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి స్థిరమైన క్యాడర్ లేదు. తెలంగాణ ప్రజలు కూడా షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రధాన పార్టీగా భావించడం లేదు. దాంతో పార్టీ అటు ప్రజల్లోనూ, ఇటు మీడియాల్లోనూ షర్మిలపై ఫోకస్ అంతంతా మాత్రంగానే ఉంది. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా కష్టమే అనే భావనా చాలామందిలో ఉంది. అందుకే తరచూ మీడియాల్లో ఏదో విధంగా హైలెట్ అయ్యేందుకే ప్రయత్నిస్తున్నారు వైఎస్ షర్మిల. కేసిఆర్ పై దూషణలు, తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, పాదయాత్రలో ఆయా నియోజిక వర్గాల ఎమ్మెల్యేలపై వ్యక్తిగత విమర్శలు చేయడం, ఇలా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికే షర్మిల ప్రయత్నిస్తున్నారనేది రాజకీయవాదుల అభిప్రాయం. అందులో భాగంగానే తాజాగా పోలీసులపై దాడి చేయడం కూడా ఒక వ్యూహాత్మకమే అనేది కొందరి భావన.
Also Read: Sudan:ఆర్మీ-పారామిలటరీ మధ్య ఘర్షణ
Cops stop YS Sharmila from leaving house; Sharmila had heated argument with police #ITVideo #Sharmila #Hyderabad | @SnehaMordani @Journo_Abdul pic.twitter.com/hTPKcw3de4
— IndiaToday (@IndiaToday) April 24, 2023